టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే యువకుడు షాక్ అయి పరుగో పరుగు.. ఇంతకి ఏముందంటే..?

by Prasanna |
టాయిలెట్ డోర్ ఓపెన్ చేయగానే యువకుడు షాక్ అయి పరుగో పరుగు.. ఇంతకి ఏముందంటే..?
X

దిశ,ఫీచర్స్ : వానాకాలం మొదలైందంటే చాలు.. ఎక్కడ చూసినా పాములే ఎక్కువ కనిపిస్తాయి. పొలాల దగ్గర నుంచి ఇల్లు వరకు అన్ని చోట్ల పాములే ఉంటాయి. అలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరూ కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బిల్డింగ్లో ఆరు అడుగుల త్రాచు పాము కనిపించింది. అక్కడ పని చేస్తోన్న ఓ యువకుడు టాయిలెట్ రూమ్ కి వెళ్లగా అక్కడ సీట్‌పై పాము పడగ విప్పి ఉంది. అది చూసిన ఆ యువకుడు అక్కడ నుంచి పరుగో పరుగు పెట్టాడు. అతడి అరుపులకు అక్కడున్న వారందరూ భయపడ్డారు.

టాయిలెట్ తలుపులకి తాళం వేసి.. స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని చాలా జాగ్రత్తగా.. గంటన్నర పాటు కష్టపడి చివరకు పామును పట్టుకున్నారు. ఆ తర్వాత ఓ అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ హాని కలగలేదు. కాగా, ప్రస్తుతం ఉత్తరాదిన వానలు విస్తారంగా కురుస్తున్నాయి. అందువల్ల పాములు ఇలా బయటకొచ్చి.. అందర్ని భయపెడుతున్నాయి.

Advertisement

Next Story