- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'మహా కుంభమేళ ప్రారంభమైనా ఎన్జీటీ ఆదేశాలకు పాటిచడం లేదు'

- గంగ, యమునాలో నీటి నాణ్యత వివరాలెక్కడ?
- మార్గదర్శకాలు పట్టించుకోని కేంద్రం, యూపీ ప్రభుత్వం
- సామాజిక కార్యకర్త ఆరోపణలు
దిశ, నేషనల్ బ్యూరో:
కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్లలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను పాటించడం లేదు. గంగ, యమున నదుల్లోని నీటి నాణ్యతను తెలియజేసేందుకు తప్పకుండా సంబంధిత రిపోర్ట్స్ సదరు వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని సామాజిక కార్యకర్త, ఆజాద్ అధికార్ సేన అధ్యక్షుడు అమితాబ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్జీటీకి లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళ ప్రారంభమైన తర్వాత కూడా ఈ రెండు నదుల్లోని నీటి నాణ్యతకు సంబంధించిన వివరాలు సంబంధిత సైట్‌లో అందుబాటులో ఉంచలేదని ఆయన పేర్కొన్నారు. గంగ, యమున నదుల్లోని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి, మురుగు నీరు అందులో కలవడం లేదని నిర్థారించాలని. నిర్ణీత కాల వ్యధిలో శాంపిల్స్ తీసి నీటిని పరీక్షించి.. ఆ రిపోర్ట్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని 2024 డిసెంబర్‌లో ఎన్జీటీ కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రయాగ్‌రాజ్ లోని డ్రెయిన్ల నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా గంగ, యమున నదుల్లో కలవకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. అయితే రెండు ప్రభుత్వాలు కూడా ఈ నిబంధనలు ఏమీ పాటించడం లేదని, ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కాయని పిటిషనర్ పేర్కొన్నారు.