వాట్సప్ క్యాంపెయినింగ్ ని ప్రారంభించిన కేజ్రీవాల్ భార్య

by Shamantha N |
వాట్సప్ క్యాంపెయినింగ్ ని ప్రారంభించిన కేజ్రీవాల్ భార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వాలని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ కు మద్దతుగా సునిత వాట్సప్ క్యాంపెయినింగ్ ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఓ వాట్సప్ నంబర్ ను ఆమె షేర్ చేశారు. ఆప్ అధినేతకు మెసజ్ లు చేయాలని కోరారు.కేజ్రీవాల్‌ను ఆశీర్వ‌దించాల‌ని డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. 8297324624 అనే వాట్సాప్ నెంబ‌ర్‌కు ప్రజల దీవెన‌లు, ప్రార్థ‌న‌ల‌ను మెసేజ్ చేయాల‌ని కోరారు. ఎలాంటి మెసేజ్ చేయాల‌నుకున్నా చేయ‌వ‌చ్చు అని స్పష్టం చేశారు సునీత కేజ్రీవాల్.

గత 30 ఏళ్లుగా తను కేజ్రీవాల్ తోనే ఉన్నట్లు.. దేశభక్తి ఆయన రక్తంలోనే ఉంది అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ ని మీ అన్నగా, కొడుకుగా భావించారు.. అతడికి మద్దతు ఇవ్వండి అని కోరారు. అందరం కలిసి పోరాడుతామని నమ్ముతున్నట్లు తెలిపారు. జైలులో ఉన్నప్పుడు అందరి సందేశాలు చదివి సంతోషిస్తాడని కచ్చితంగా అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే విధంగా గురువారం కూడా సునీత ఓ వీడియో మెసేజ్ ను షేర్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త ఆరోగ్యం సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు. మరోవైపు ఇదే కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed