కేజ్రీవాల్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. రెండువారాల పాటు విచారణ వాయిదా

by Shamantha N |
కేజ్రీవాల్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. రెండువారాల పాటు విచారణ వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్ల సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈకేసుపై తక్షణ విచారణ చేపట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా.. తక్షణ విచారణ చేపట్టలేమని స్పష్ట చేసింది సుప్రీంకోర్టు. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం..రెండు వారాల తర్వాత విచారణ చేపడతామంది.

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 పిటిషన్ పై విచారణ చేపడతామని తెలిపింది. ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని కోరింది. సుప్రీం కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, రిమాండ్ చేయడం కేవలం నిందితులిచ్చిన ప్రకటనల ఆధారంగానే జరిగిందన్నారు. ఈ నిందితులు ఇప్పుడు ప్రభుత్వ సాక్షులుగా మారారని అన్నారు.

మరోవైపు ఏప్రిల్ 9న ఈ పిటషన్ ను తోసిపుచ్చింది ఢిల్లీ హైకోర్టు. తన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించాడని పేర్కొంది. ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీని రూపొందించడంలో వ్యక్తిగత సామర్థ్యంతో పాటు కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలోనూ కేజ్రీవాల్ పాత్ర ఉందని తెలిపింది. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారని కోర్టు పేర్కొంది.

ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కూడా సోమవారంతో ముగియనుంది. దీంతో, కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఒకవేళ కస్టడీని పొడిగిస్తే.. మరికొన్ని రోజులు జైళ్లో ఉండనున్నారు కేజ్రీవాల్.

Advertisement

Next Story

Most Viewed