- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. కారణమిదే
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను దాటవేశారు. లిక్కర్ స్కాంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలంటూ ఈనెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ సమన్ల ప్రకారం ఢిల్లీ సీఎం సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన ఇంతకుముందులాగే విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున.. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న టైంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమైనవిగా కనిపిస్తున్నాయని ఆప్ ఆరోపించింది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని తెలిపింది. ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో.. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లోనూ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఐపీసీ సెక్షన్ 174 కింద కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగానే సమన్లను ఆయన దాటవేస్తున్నారని న్యాయస్థానానికి తెలిపింది. పలు కారణాలతో ఈ విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది.