- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arvind Kejriwal: కేజ్రీకి జైలా.. బెయిలా..! నేడు రిమాండ్ పిటిషన్‌పై విచారణ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తతం తీహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే, ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం, మధ్యాహ్నం 2.30కి తన తీర్పును వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ పార్టీ పరువు ప్రతిష్టలను రోడ్డుకీడ్చేందుకు కేజ్రీని అక్రమంగా అరెస్ట్ చేయించారంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగ అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పీఠం నుంచి తప్పించాలంటూ దాఖలైన మరో పిటిషన్‌ను నిన్న ఉదయం ఢిల్లీ హైకోర్టు విచారించింది. పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్‌పై కోర్టు ఘాటు వ్యాఖ్యల చేసింది. ఇలాంటి అర్థం లేని పిటిషన్లు వేస్తే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.