నీరజ్ చోప్రా తన బిడ్డే అంటున్న పాకిస్థాన్ మహిళ.. ఇంతకీ ఎవరామే.?

by M.Rajitha |
నీరజ్ చోప్రా తన బిడ్డే అంటున్న పాకిస్థాన్ మహిళ.. ఇంతకీ ఎవరామే.?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒలంపిక్స్ జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ తన బిడ్డే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ పాకిస్థాన్ మహిళ. ఇంతకీ.. ఎవరామే? ఆ మహిళ ఎవరో కాదు జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తల్లి పర్వీన్. "నీరజ్ కూడా నా కొడుకు లాంటివాడే, తను నదీమ్ కు స్నేహితుడే కాదు.. సోదరుడు కూడా. గెలుపు ఓటములు ఆటలో సహజం. దేవుడు తనను ఆశీర్వదించాలి. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ ఇద్దరూ గెలవాలి. నా కొడుకుతోపాటు నీరజ్ కూడా గెలవాలని ప్రార్థించాను" అంటూ మీడియాతో మాట్లాడింది. పర్వీన్ మాటలను ఇరుదేశాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అమ్మ ఎవరికైనా అమ్మే అంటూ పొగడ్తల్లో ముంచేస్తున్నారు. కాగా అంతకముందు నీరజ్ తల్లి సరోజ్ దేవి.. నదీమ్ మీద కూడా ఇలానే స్పందించారు. "ఒలంపిక్ లో నా బిడ్డ సిల్వర్ మెడల్ గెలవడం మాకు సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ గెలిచిన నదీమ్ కూడా తనకు మరో కొడుకు లాంటివాడు. ఆసియాలోని పొరుగు దేశాలు అయిన పాకిస్తా, భారత్.. గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలవడం అమనకు గర్వకారణం" అని సరోజ్ దేవి అన్నారు.

Next Story