అహంకారం వల్లే రాముడు 241 సీట్ల వద్ద ఆపాడు.. ఆర్ఎస్ఎస్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
అహంకారం వల్లే రాముడు 241 సీట్ల వద్ద ఆపాడు..  ఆర్ఎస్ఎస్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార పార్టీ వాళ్ల అహంకారం వల్లే రాముడు వారిని 241 సీట్ల వద్ద ఆపాడని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు. జైపూర్ సమీపంలోని కనోటాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన బీజేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ పేలవ ప్రదర్శన వల్లే ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయని, రామభక్తితో మెలిగే వారు క్రమంగా దురహంకారంతో అలరారుతారని, ఆ పార్టీని అతి పెద్ద పార్టీగా ప్రకటించినా.. వారి అహంకారం కారణంగా రాముడు 241 సీట్ల వద్ద ఆపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 తర్వాత ఇదే అత్యంత దారుణమైన ప్రదర్శన అని తెలిపారు.

అలాగే ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి వారిని యాంటీ రామ్ అని ప్రస్తావించాడు. రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 స్థానాలు కైవసం చేసుకున్నారని, దేవుడి న్యాయం నిజమైనదని, ఆనందదాయకం అని పేర్కొన్నారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఆర్ఎస్ఎస్ నాయకుడు విమర్శలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, అలాగే ప్రజాసేవలో ఉండాల్సిన వినయం గురించి, ప్రస్తుత రాజకీయాల గూర్చి ఇరు కూటములకు క్లాస్ పీకిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ తన సైద్దాంతిక గురువుగా భావించే ఆర్ఎస్ఎస్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed