రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్తున్నారా.. అయితే టికెట్స్ ఇలా కొనుక్కోండి

by samatah |
రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్తున్నారా.. అయితే టికెట్స్ ఇలా కొనుక్కోండి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత గణతంత్ర దినోత్సం(జవవరి 26) సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలో వేడుకలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత త్రివిధ దళాలు పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిని వీక్షించేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఢిల్లీకి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరబోయే గణతంత్ర వేడుకలకు రాజ్ పథ్‌లో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న ఉదయం 9.30గంటలకు విజయ్ చౌక్ నుంచి ప్రారంభమయ్యే కవాతు నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుంది. సాయుధ విమానాలు, యుద్ధ ప్రదర్శనలు, మార్చ్ ఫాస్ట్ వంటివి ఉంటాయి. అయితే వీటిని చూడటానికి వెళ్లేందుకు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో:

టికెట్‌ను ఆన్ లైన్‌లో కొనుగోలు చేయాలంటే ముందుగా ఇన్విటేషన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లేదా రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ అమంత్రల్ ఆన్ లైన్ పోర్టల్ (aamantran.mod.gov.in/login)లోకి వెళ్లాలి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం ఈవెంట్‌ల జాబితా నుంచి ‘రిపబ్లిక్ డే పరేడ్’ ని ఎంచుకుని గుర్తింపు కార్డు అప్‌లోడ్ చేయాలి. ఆతర్వాత డబ్బులు చెల్లించి టికెట్ పొంది.. దానిని ప్రింట్ తీసుకోవాలి. ఇక, ఆఫ్ లైన్‌లో టికెట్ పొందాలంటే ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ట్రావెల్ కౌంటర్లు, ఢిల్లీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డీటీడీసీ) కౌంటర్లు, ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో డిపార్ట్‌మెంటల్ సేల్ కౌంటర్‌లతో సహా వివిధ ప్రదేశాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్‌లను పొందవచ్చు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌ కొనుగోలుకు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed