Gujarat లో కాంగ్రెస్ ఘోర ఓటమికి అవే కారణమా?

by Javid Pasha |   ( Updated:2022-12-08 05:58:35.0  )
Gujarat లో కాంగ్రెస్ ఘోర ఓటమికి అవే కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: నెల రోజులుగా పార్టీలకు నిద్ర లేకుండా చేసిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతూ ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇక ఆప్ 6 స్థానాల్లో ముందంజలో ఉండగా.. స్వతంత్రులు 4 స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఇక గుజరాత్ పీఠాన్ని అధిరోహించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. కేవలం 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ చతికిల పడింది. దాదాపు 60కి పైగా సిట్టింగ్ స్థానాల్లో డిపాజిట్ కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆప్, ఎంఐఎం పార్టీలు కోలుకోలేని దెబ్బ తీశాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 గెలుచుకొని అధికారం చేపట్టగా.. కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకొని గట్టి పోటీని ఇచ్చింది. అయితే ఈ సారి ఎవరూ ఊహించని రీతిలో విపక్షాలకు అవకాశమివ్వకుండా బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు కైవసం చేసుకోబోతుంది.

అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ 20 లోపు స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఘోర పరాభవానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం.. ఆప్, ఎంఐఎం. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బ తీశాయి. పరోక్షంగా బీజేపీ విజయానికి దోహదపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండో కారణం.. రాహుల్ గాంధీ. ఓ వైపు గుజరాత్ హోరాహోరీ పోరు సాగుతుంటే భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ అంటిముట్టనట్లు వ్యవహరించారు. ఇది కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read....

Gujarat Election Result 2022 : గుజరాత్‌లో బీజేపీకి కలిసొచ్చింది అదేనా?

Advertisement

Next Story