ప్రధాని మోడీ చేతుల మీదుగా 71 వేల ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్స్

by Mahesh |   ( Updated:2023-05-16 12:45:59.0  )
ప్రధాని మోడీ చేతుల మీదుగా 71 వేల ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఉద్యోగులకు లెటర్స్ అందించారు. గ్రామీణ డాక్ సేవక్, కమర్షియల్-కమ్-టికెట్ క్లర్కు, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ వంటి వివిధ పోస్టులలో చేరుతారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. "గత తొమ్మిదేళ్లలో, ప్రభుత్వం... మూలధన వ్యయం కోసం సుమారు ₹ 34 లక్షల కోట్లు ఖర్చు చేసింది" అని ప్రధాని మోదీ అన్నారు.

Advertisement

Next Story