సల్మాన్ ఖాన్‌పై దాడికి మరో కుట్ర: బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురి అరెస్ట్

by vinod kumar |
సల్మాన్ ఖాన్‌పై దాడికి మరో కుట్ర: బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై దాడికి గానూ చేసిన మరో కుట్ర బయపడింది. ముంబైలోని పన్వెల్‌లో సల్మాన్‌ కారుపై దాడికి ప్లాన్‌ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుంచి సేకరించిన ఆయుధాలతో సల్మాన్‌పై దాడి చేయడానికి వీరు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ వాహనం లేదా ఆయన ఫామ్ హౌస్ పై దాడి చేయడానికి ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. కెనడాకు చెందిన అతని బంధువు అన్మోల్ బిష్ణోయ్ సహచరుడు గోల్డీ బ్రార్‌తో కలిసి పాకిస్థానీ ఆయుధ వ్యాపారి నుంచి ఏకే-47, ఎం-16, ఇతర ఆయుధాలను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాగా, ఏప్రిల్ 14న కూడా బాంద్రాలోని సల్మాన్ నివాసముండే అపార్ట్ మెంట్‌పై నిందితులు పలు మార్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed