- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి మిలిటెంట్లు రెచ్చిపోయారు. జిరిబామ్ జిల్లాలోని మోంగ్‌బంగ్ గ్రామంలో కుకీ కమ్యూనిటీకి చెందిన వారిగా అనుమానిస్తున్న సాయుధ వ్యక్తులు సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోగా..మరో సైనికుడు, ఇద్దరు మణిపూర్ పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. మోంగ్‌బంగ్‌లోని కొండ ప్రాంతం నుంచి కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను బిహార్ కు చెందిన అజయ్ కుమార్ ఝా గా గుర్తించారు. అజయ్ తలకు బుల్లెట్లు తాకాయని, ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాడి తర్వాత అధికారులు మోంగ్ బాంగ్‌లో అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనను మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ దాడి వెనుక కుకీ తిరుగుబాటుదారుల హస్తం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఇది సరైన చర్య కాదు. విధి నిర్వహణలో అమరుడైన అజయ్ త్యాగం వృథా కాదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.