ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CM కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

by Satheesh |   ( Updated:2024-07-10 12:00:39.0  )
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CM కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన కేజ్రీవాల్‌ను న్యాయస్థానంలో హాజరు పర్చాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్‌తో కలిసి మద్యం పాలసీలో అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసింది.

సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేత విజయనాయర్‌కు రూ.100 కోట్లు క్విక్ బ్యాక్ రూపంలో చేరాయని.. ఇందులో నుండి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ రూ.45 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించింది. వినోద్ చౌహన్ అనే వ్యక్తి నుండి హవాలా మార్గంలో రూ.45 కోట్లు నేరుగా ఆప్‌కు లబ్ధి చేకూరిందని ఈడీ పేర్కొంది. కాగా, ఈడీ దాఖలు చేసిన తాజా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో కేజ్రీవాల్‌ను ఏ-37గా పేర్కొన్న ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావనను కేజ్రీవాల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో ఈడీ మరోసారి తెరపైకి తెచ్చింది.

Advertisement

Next Story

Most Viewed