- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలం దున్నుతుండగా మట్టిలో మెరుస్తూ బయటపడ్డ విలువైన వస్తువులు
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో పురాతన(ancient), చారిత్రాత్మకమైన వస్తువులు(Historical objects) బయటపడుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం.. యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో గ్రామస్థులు తమ పొలాలను దున్నుతుండగా పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. ఈ ఆయుధాలను 18వ శతాబ్దానికి చెందినవి గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. రోజువారీ కూలీలు పొలంలో బంగాళదుంపలు నాటుతుండగా మట్టిలో మెరుస్తూ వింత వస్తువులు కనిపించాయి. వాటిని బయటకు తీసి చూడగా.. వెండి నాణేలు(Silver coins)గా తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. గజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్గామా గ్రామంలో కూలీలు ఓ పొలంలో బంగాళదుంపలు(Potatoes) నాటుతున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న గుంటలు చేస్తుండగా.. మట్టిలో మెరుస్తూ.. పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. అవి చూసి ఆశ్చర్యపోయిన కార్మికులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ స్టేషన్ నుండి ఒక టీం వచ్చి.. నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ నాణేల చారిత్రక ఆధారాలు తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు అప్పగించారు. పొలంలో మొత్తం 16 వెండి నాణేలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఆ నాణేలు చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన సుల్తాన్, పాల్ కాలం నాటివిగా అంచనా వేస్తున్నారు.