అమూల్ పాల ధరలు పెంపు..లీటర్‌కు ఎంతంటే?

by vinod kumar |
అమూల్ పాల ధరలు పెంపు..లీటర్‌కు ఎంతంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమూల్ పాల ధరను లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు నుంచే ఇవి అమలులోకి వస్తాయని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఇతర అన్ని మార్కెట్‌లలో ఇవే ధరలు వర్తిస్తాయని వెల్లడించింది. పాల ఉత్పత్తి, ఇతర కార్యకలాపాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. పెరిగిన ధరల ప్రకారం..మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ రూ.68కి లభిస్తుంది. టోన్డ్, డబుల్ టోన్డ్ పాలు లీటరుకు వరుసగా రూ.56, రూ.50గా ఉంటుంది. అలాగే గేదె పాలు రూ.72, ఆవు పాలు లీటర్ కు రూ. 58కి లభిస్తుంది. గత కొన్ని నెలలుగా పాల సేకరణకు అధిక ధరలు చెల్లించినప్పటికీ, వినియోగదారు ధరలను అలాగే ఉంచామని తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజుకు 35 లక్షల లీటర్ల తాజా పాలను విక్రయిస్తున్న మదర్ డెయిరీ, 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా పాల ధరలను సవరించింది. కాగా, లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed