- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah : అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) హెలికాప్టర్, బ్యాగులను తనిఖీ చేశారు. శుక్రవారం మహారాష్ట్ర(Maharashtra)లోని హింగోలిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు అమిత్‌షా హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఆయన హెలిప్యాడ్‌లో దిగిన వెంటనే.. అక్కడున్న ఈసీ అధికారులు హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు. అన్ని బ్యాగులను చెక్ చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’లో అమిత్‌షా పోస్ట్ చేశారు. ‘‘ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. బీజేపీ కోరుకునేది అదే. ఎన్నికల కమిషన్ నియమాలను అందరూ తప్పకుండా పాటించాలి. ఈసీకి సహకరించాలి. బీజేపీ నేతలంతా ఈసీకి సహకరిస్తారు. హింగోలిలో నా హెలికాప్టర్‌ను కూడా తనిఖీ చేశారు’’ అని ఆయన వెల్లడించారు.
‘‘ఎన్నికల వ్యవస్థను మనం ఆరోగ్యవంతంగా ఉంచాలి. ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామిక వ్యవస్థగా భారత్ నిలవాలంటే ప్రతి ఒక్కరు వారివారి విధులను సక్రమంగా నిర్వర్తించాలి’’ అని అమిత్‌షా ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్‌ల హెలికాప్టర్లను సైతం ఈసీ అధికారులు చెక్ చేశారు. ‘‘ఈసీ అధికారులు తనిఖీల కోసం కేవలం విపక్ష నేతలనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌షా లాంటి అధికార పక్షం నేతల వాహనాలు,హెలికాప్టర్లను తనిఖీ చేసేందుకు చొరవ చూపలేకపోతున్నారు’’ అని శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇటీవలే విమర్శించారు. ఈనేపథ్యంలో అధికార పక్షం నేతల హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేస్తుండటం గమనార్హం.