బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు అది జరగదు.. రిజర్వేషన్లపై అమిత్ షా

by Prasad Jukanti |   ( Updated:2024-04-29 12:23:13.0  )
బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు అది జరగదు.. రిజర్వేషన్లపై అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ సత్యదూర ఆరోపణలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఓబీసీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లిం మైనార్టీలకు కట్టబెడుతోందని ఆరోపించారు. బీజేపీ గత పదేళ్లుగా అధికారంలో ఉందని రెండు సార్లు మేం పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఒకవేళ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనే మాకు ఉంటే ఆ పని పూర్తి చేసేవాళ్లం కదా అన్నారు. ఆదివారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన తాము అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని దళిత, బలహీన, గిరిజనులకు మోడీ హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రాగానే నాలుగు శాతం రిజర్వేషన్లు ఓబీసీ కోటాలో నుండి మైనార్టీలకు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పడు అక్కడ కూడా మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అవి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలో నుంచి తీసి మైనార్టీలకు ఇచ్చారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed