- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా సురక్షితమైన ప్రదేశమే: భారత్‌లోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి
దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన విద్యార్థులపై అమెరికాలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. చదువుకోవడానికి యూఎస్ సురక్షితమైన ప్రదేశమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భారతీయులకు తెలియజేసేందుకు ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. శనివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ఇతర దేశాల కంటే అత్యధిక మంది భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. గతేడాది రెండు లక్షల వీసాలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. భారత విద్యార్థులపై జరిగిన దాడుల పట్ల విచారం వ్యక్తం చేసిన ఎరిక్..ఇలాంటి విషాదాలు మన హృదయాలను కలిచి వేస్తాయన్నారు. భారత విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం భారతీయులకు పూర్తి భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. చదువుకోవడానికి యూఎస్ ఎప్పటికీ మంచి ప్రదేశమని కొనియాడారు. ఎటువంటి సందర్భంలోనైనా భారత్ ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, ఇటీవల అమెరికాలో ఐదుగురు భారత సంతతి విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించగా..పలువురు విద్యార్థులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.
దాడికి గురైన భారత సంతతి వ్యక్తి మృతి
వాషింగ్టన్‌లో ఇటీవల దాడికి గురైన భారత సంతతికి చెందిన వివేక్ చందర్ తనేజా(41) అనే వ్యక్తి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. తీవ్ర గాయాలతో బయటపడిన కొద్ద రోజులకే పరిస్థితి విషమించి మరణించినట్టు వెల్లడించారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 6కు చేరుకుంది.