Amazon: అమెజాన్ ఇండియా హెడ్ గా సమీర్ కుమార్

by Shamantha N |
Amazon: అమెజాన్ ఇండియా హెడ్ గా సమీర్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెజాన్‌ ఇండియా హెడ్ గా సమీర్‌కుమార్‌ (Samir Kumar) నియామకం అయ్యారు. ఈవిషయాన్ని ఇ-కామర్స్‌ దిగ్గజం బుధవారం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కార్యాచరణ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపింది. మనీశ్‌ తివారీ (Manish Tiwary) రాజీనామా అనంతరం ఆ స్థానంలో సమీర్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారని వెల్లడించింది. "25 ఏళ్ల అనుభవజ్ఞుడైన సమీర్ కుమార్ అమెజాన్ ఇండియా బిజినెస్ ని పర్యవేక్షిస్తారు. ప్రస్తుత హెడ్ మనీశ్ తివారీ అమెజాన్ ను వీడేందుకు నిర్ణయం తీసకున్నారు. కంపెనీకి వెలుపల ఇతరత్రా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తివారీ రాజీనామా చేశారు." అని అప్ డేట్ లో పేర్కొంది.

తివారీ స్థానంలో కుమార్

సమీర్‌కుమార్‌ 1999లో అమెజాన్‌లో చేరారు. 2013లో Amazon.in ను తీసుకొచ్చిన బృంద సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. మిడిల్ ఈస్ట్, సౌతాఫ్రికా, టర్కీలతో పాటుగా భారత్ హెడ్ గా బాధ్యతలను నిర్వర్తిస్తారని అమెజాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అన్నారు సౌరభ్ శ్రీవాస్తవ (కేటగిరీలు), హర్ష్ గోయల్ (ఎవ్రీడే ఎస్సెన్షియల్స్), అమిత్ నందా (మార్కెట్‌ప్లేస్), ఆస్తా జైన్ (గ్రోత్ ఇనిషియేటివ్స్) బృందానికి సమీర్ కుమార్ హెడ్ గా వ్యవహరిస్తారు. అమెజాన్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ తివారీ (Manish Tiwary) ఆగస్టు 6న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో సమీర్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed