- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లివిన్ రిలేషన్షిప్’పై హైకోర్టు కీలక తీర్పు.. ఓ ప్రియుడికి షాక్
దిశ, నేషనల్ బ్యూరో : సహ జీవన సంబంధాలను(లివిన్ రిలేషన్షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని.. భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు. తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి హితవు పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికి కిరీటం లాంటివని.. వాటిని గౌరవించాలని సూచించారు. సమాజంలో సదరు మహిళ, ఆమె కుటుంబం పరువును తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీమ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి, అవమాన భయానికి గురి చేసి.. రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్ఠలు తీసే ఇలాంటి పిటిషన్‌ను కోర్టు సమర్ధించబోదని స్పష్టం చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు పిటిషనర్‌పై రూ.25వేల జరిమానా కూడా విధించారు.