- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajith pawar Ncp: స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం..ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. మహాయుతి కూటమి సభ్యులకు లోకల్ బాడీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసే స్వేచ్ఛ ఉందని తెలిపారు. పింప్రి చించ్వాడ్‌లో ఆదివారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్సీపీ లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి పోరాడింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాగస్వామ్య పార్టీలతో కలిసి పోరాడతాం. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతాం’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు గాను కార్యకర్తలు పూర్తి సన్నదంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రంలోని అధికార ‘మహాయుతి’ కూటమిలో బీజేపీ, శివసేనలతో కలిసి ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. దీంతో అజిత్ తాజా ప్రకటన కూటమిలో చర్చ నీయాంశంగా మారింది.