Ajith pawar Ncp: ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ వివాదం..అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు

by vinod kumar |
Ajith pawar Ncp: ఎన్సీపీ వర్సెస్ ఎన్సీపీ వివాదం..అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ గ్రూప్ నాయకుడు జయంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ మేరకు అజిత్ పవార్ వర్గానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయ మూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషన్ నిర్వహణపై ఉన్న వివాదాలను మెరిట్‌లతో పాటు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. అజిత్ పవార్ గ్రూప్ తన సమాధానం దాఖలు చేసిన తర్వాత ఈ అంశాన్ని తదుపరి విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును విచారించడానికి కోర్టు ఎటువంటి తేదీని నిర్ణయించలేదు. అయితే మూడు వారాల తర్వాత తదుపరి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే అజిత్ గ్రూపు ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ మహారాష్ట్ర స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సమయంలో దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed