- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Air Pollution in Delhi : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయికాలుష్యం!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 419 కి చేరింది. గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల కనిష్టానికీ పడిపోయాయి. దీంతో పొగ మంచు పెరిగి గాలి నాణ్యత లోపిస్తోంది. దీంతో వాయి కాలుష్య నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రోజు నుంచి ఢిల్లీలో బీఎస్-III పెట్రోల్, బీఎస్-IV డీజిల్ ఫోర్-వీలర్లపై తాత్కాలిక నిషేధం విధించింది. మరో వైపు కాలుష్య నిరోధక నియంత్రణలను అమలు చేయాలని ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)కేంద్రానికి కీలక సూచనలు చూసింది. ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టకుండా చర్యలు తీసుకునేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోగా తాజాగా వాహనాలపై ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత సరిగా లేని కారణంగా ఢిల్లీ నుండి కొన్ని విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి.