విమానం ఆలస్యమైనందుకు.. ఒక్కో ప్రయాణికుడికి రూ.29వేల వోచర్

by Shamantha N |
విమానం ఆలస్యమైనందుకు.. ఒక్కో ప్రయాణికుడికి రూ.29వేల వోచర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానం 30 గంటలు ఆలస్యమైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో, ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సాంకేతిక సమస్యల వల్ల శాన్ ఫ్రాన్సిస్కో రావాల్సిన ఫ్లైట్ డిలే అయ్యిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ క్లాస్ గోయర్ష్ తెలిపారు. ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ లో ప్రయాణించేందుకు ఒక్కో ప్రయాణికుడికి 350 డాలర్ల(రూ.29వేల) చొప్పున ట్రావెల్ వోచర్ ను అందజేస్తున్నట్లు ప్రకటించారు. వోచర్ ను ట్రావెల్ కోసం వాడుకోవచ్చని లేదంటే.. క్రెడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎయిరిండియా సేవలో జరిగిన జాప్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్లైట్ డిలే, ప్రయాణికులపై నిర్లక్ష్యం వహించారని డీజీసీఏ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత ఎయిరిండియా ఈ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story