- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పతాగి ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులు?
దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంతకాలంగా విమాన ప్రయాణాల్లో వికృత చేష్టలతో వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో మద్యం సేవించిన ఓ వ్యక్తి 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో ఎయిర్‌ఇండియా విమానంలో కొందరు తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటమేగాక, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఫ్లైట్ అటెండెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విమాన సిబ్బంది వీరి గురించి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, మద్యం తాగడమే కాకుండా విమానంలోకి మద్యం బాటిళ్లను తీసుకువెళుతున్నారని చెబుతున్నారు.
రాత్రి 10 గంటలకు విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారవ్వగా అతడి కోసం గాలిస్తున్నారు. అయితే నిందితులు బిహార్‌కు చెందినవారని గుర్తించారు. పీకలదాకా మద్యం తాగి విమాన సిబ్బందితో గొడవకు దిగిన ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరు పరుస్తామని విమానాశ్రయ పోలీసు అధికారి రాబర్ట్ పీటర్ చెప్పారు. కాగా, ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. కాగా ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
Also Read...