కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయులు.. నేడు స్వదేశానికి మృతదేహాలు..

by Indraja |
కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయులు.. నేడు స్వదేశానికి మృతదేహాలు..
X

దిశ వెబ్ డెస్క్: రెండు రోజులు క్రితం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది కార్మికులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు విదేశాంగ జూనియర్ మంత్రి గోండా ఎంపీ కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ అధికారులతో చర్చించి అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికులను భారత్‌కు తరలించేలా నిర్ణయించారు.

కాగా 45 మంది మృతదేహాలతో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం కువైట్ నుండి భారత్‌కు బయలు దేరిందని కువైట్ లోని భారతీయ కార్యాలయం పేర్కొంది. అయితే ఇటీవల విదవిదేశాంగ శాఖలో జూనియర్ మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఎంపీ కీర్తి వర్ధన్ సింగ్ సైతం మృతదేహాలను తరలిస్తున్న విమానంలోనే భారత్‌కు తిరిగి వస్తున్నారు.

కాగా కువైట్ నుండి మృతదేహాలతో భారత్‌కు బయలు దేరిన విమానం ఈ రోజు ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చిలో ల్యాండ్ కానుంది. కాగా మరణించిన వారిలో 23 మంది కేరళ వాసులు ఉన్నారు. అలానే 7 మంది తమిళనాడుకు, ముగ్గురు ఉత్తర ప్రదేశ్‌కు, ఇద్దరు ఒరిస్సాకు, ఒకరు బీహార్, ఒకరు పంజాబ్, ఒకరు కర్ణాటక, ఒకరు మహారాష్ట్ర, ఒకరు వెస్ట్ బెంగాల్, ఒకరు జార్ఖండ్, ఒకరు హర్యానా రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed