బ్రేకింగ్: కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య.. అధికారికంగా ప్రకటించిన AICC

by Satheesh |   ( Updated:2023-05-18 07:05:29.0  )
బ్రేకింగ్: కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య.. అధికారికంగా ప్రకటించిన AICC
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై 5 రోజులుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు సీఎం క్యాండిడేట్‌గా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. ఈ మేరకు ఏఐసీసీ నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్ గురువారం అధికారికంగా ప్రకటించారు. సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పారు. సీఎం పదవి కోసం చివరి వరకు డీకే శివకుమార్ ప్రయత్నాలు చేసినా అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. గురువారం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ గా డీకే శివకుమారే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇవాళ సీఎల్పీ సమావేశం ఉంటుందని 20వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు సిద్ధరామయ్య, శివకుమార్‌లు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

తమది ప్రజాస్వామ్య పార్టీ అని నితంతృత్వం లేదని అందువల్లే.. అభిప్రాయ సేకరణ, చర్చల తర్వాతే సీఎం అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఇద్దరూ అర్హులేనని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాట్లాడిన తర్వాత సీఎం ఎవరనేదానిపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేణుగోపాల్ ప్రకటనకు ముందు సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఒకే కారులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరి వెళ్లారు. తామంతా ఒక్కటే అని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సీఎం పదవి విషయంలో షేరింగ్ ఉంటుందా లేదా అనేది స్పష్టత రాలేదు.

Advertisement

Next Story

Most Viewed