అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాక.. భారత్ కీలక నిర్ణయం.. వాటిపై ఎక్స్‌ట్రా ట్యాక్స్ ఎత్తివేత్త

by Vinod kumar |
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాక.. భారత్ కీలక నిర్ణయం.. వాటిపై ఎక్స్‌ట్రా ట్యాక్స్ ఎత్తివేత్త
X

న్యూఢిల్లీ : జీ20 సదస్సుకు ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 7 అమెరికా ఉత్పత్తులపై అదనపు పన్నులను ఎత్తేసింది. ఈ ఉత్పత్తుల లిస్టులో బాదం, వాల్‌నట్స్‌, శెనగలు, ఉలవలు, యాపిల్స్, వైద్య పరీక్షల రీఏజెంట్లు, బోరిక్‌ యాసిడ్‌ ఉన్నాయి. 2019లో భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా పెంచింది. దీనికి ప్రతిగా అప్పట్లో భారత్ కూడా పలు అమెరికా ఉత్పత్తులపై అదనపు ట్యాక్స్‌లను విధిస్తామని ప్రకటించింది. వాటిలోనే కొన్నింటిని ఇప్పుడు అదనపు ట్యాక్స్ కేటగిరీ నుంచి మినహాయించింది.

ప్రధాని మోడీ జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ మరుసటి నెలలోనే (జులైలో) అమెరికాకు చెందిన 7 ఉత్పత్తులపై ఎక్స్ ట్రా ట్యాక్స్‌ను ఎత్తేసే అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదని ఆనాడు స్పష్టం చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో దీనిపై భారత ప్రభుత్వం మరోసారి అధికారిక ప్రకటన చేసింది.

Advertisement

Next Story

Most Viewed