- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agni 4 : అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్.. 4వేల కి.మీ దూరంలోని శత్రులక్ష్యాలు ఖతం
దిశ, నేషనల్ బ్యూరో : అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఈ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. ఈ పరీక్ష సక్సెస్ కావడంతో అగ్ని-4 మిస్సైల్‌లోని సాంకేతిక వ్యవస్థలు, నిర్వాహక వ్యవస్థలు సరిగ్గానే పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మన దేశానికి చెందిన న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) పరిధిలోని వ్యూహాత్మక దళాల కమాండ్ పర్యవేక్షణలో ఈ ప్రయోగ పరీక్ష జరగడం గమనార్హం.
దాదాపు 4వేల కిలోమీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ అగ్ని-4 మిస్సైల్ సొంతం. 20 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 1000 కేజీల పేలోడ్‌ను తనతో మోసుకెళ్లగలదు. భారీ ట్రక్కులలో తరలించి, ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అనువుగా ఈ మిస్సైల్ నిర్మాణం ఉంటుంది. చివరిసారిగా 2012 సంవత్సరంలో అగ్ని-4 మిస్సైల్‌ను పరీక్షించారు. అప్పట్లో అది 20 నిమిషాల వ్యవధిలో 3వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. అగ్ని-4 క్షిపణిని అగ్ని-2 ప్రైమ్ అని కూడా గతంలో పిలిచేవారు. అగ్ని మిస్సైళ్లను మన దేశానికి చెందిన డీఆర్‌డీఓ డెవలప్ చేసింది.