- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్వా చౌత్: భర్త కోసం రోజంతా ఉపవాసం.. రాత్రి హత్య
దిశ, నేషనల్ బ్యూరో: కర్వా చౌత్ నాడు భర్త ఆయురారోగ్యాల కోసం భార్య ఉపవాసం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సవిత కూడా తన భర్త కోసం రోజంతా ఉపవాసం ఉన్నది. కానీ, రాత్రి తన భర్త శైలేష్ కుమార్‌ను చంపేసింది. కౌశాంబి జిల్లా కడా ధామ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్వా చౌత్ పండుగలో భాగంగా సవిత తన భర్త కోసం ఉపవాసం ఉన్నది. ఈ పండుగ కోసమే భర్త శైలేష్ ఉదయం నుంచి ఏర్పాట్లు చేశాడు. సాయంత్రం పూట ఉపవాసం విరమిస్తుండగా శైలేష్‌కు, సవితకు మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయినట్టుగానే ఇద్దరూ కలిసి భోజనం చేశారు. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు సవిత ఆరోపించింది.
ఇద్దరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుండగా ఏదో వస్తువు తీసుకురమ్మని పొరిగింటికి భర్తను పంపింది సవిత. తిరిగి వచ్చాక ఇద్దరూ భోజనం చేశారు. ఆ తర్వాత సవిత అక్కడి నుంచి పారిపోయింది. శైలేష్ సోదరుడు అఖిలేశ్ అక్కడికి వచ్చాడు. సోదరుడు శైలేష్ ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నదని గమనించి హాస్పిటల్ తీసుకెళ్లాడు. అక్కడే అఖిలేష్.. శైలేష్ మాట్లాడుతుండగా వీడియో రికార్డ్ చేశాడు. తన భార్య తనకు భోజనంలో విషం పెట్టినట్టు శైలేష్ చెప్పాడు. చికిత్స జరుగుతుండగానే పరిస్థితులు విషమించి శైలేష్ మరణించాడు. సవితను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్మాయిల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, కేసు నమోదు చేసి నిందితురాలుని అరెస్టు చేసినట్టు కౌశాంబి ఎస్పీ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.