ఒకేరోజు ఢిల్లీ, ముంబైలోకి రుతుపవనాలు.. 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

by Vinod kumar |
ఒకేరోజు ఢిల్లీ, ముంబైలోకి రుతుపవనాలు.. 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
X

న్యూఢిల్లీ : 62 ఏళ్ల తర్వాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి ఒకేసారి రుతుపవనాలు వచ్చాయి. ఇలా చివరిసారిగా 1961 జూన్ 21న ఒకేసారి మాన్ సూన్స్ ఈ రెండు సిటీలలోకి ఎంటరయ్యాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 27న ఢిల్లీని తాకుతాయి. కానీ, ఈ ఏడాది షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే వచ్చేశాయి. ముంబైలోకి సాధారణంగా రుతుపవనాలు వచ్చే తేదీ జూన్ 11. అయితే ఈ సారి రెండు వారాలు ఆలస్యంగా నగరంలోకి అవి ప్రవేశించాయని ఐఎండీ పేర్కొంది.

రుతుపవనాల రాకతో ఒకదానికొకటి 1,430 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో 47.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఐఎండీ సోమవారానికి ఆరెంజ్ అలర్ట్, బుధ, గురువారాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం నుంచి వర్షాలతో తడుస్తున్న ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed