14వ 'ఏరో ఇండియా 2023' అట్టహాసంగా ప్రారంభం

by samatah |   ( Updated:2023-02-13 07:55:59.0  )
14వ ఏరో ఇండియా 2023 అట్టహాసంగా ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 14వ 'ఏరో ఇండియా 2023' అట్టహాసంగా ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనను సోమవారం ఉదయం బెంగళూరు శివారులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తదితరుల సమక్షంలో పీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విమానాల విన్యాసాలను ప్రధాని తిలకించారు.

ఈ సందర్భంగా ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో వైమానిక రంగంలో ఎన్నో అవకాశాలకు వారధిగా నిలుస్తుందని మోడీ అన్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని భారత దేశ ఆత్మ విశ్వాసానికి ప్రతీక అన్నారు. 'ద రన్ వే టు బిలియన్ ఆపర్చునిటీస్' పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ ఏడాది 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed