ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అదానీ గ్రూప్ బాసట

by Javid Pasha |
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అదానీ గ్రూప్ బాసట
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగా పాఠశాల విద్యను అందిస్తామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితులను ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

ఇక ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే వారి పాఠశాల విద్యకు అయ్యే ఖర్చును అదానీ గ్రూప్ భరిస్తుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed