రాజ్యసభ సీటు కోసం డీల్.. ఎన్నికల బరి నుంచి కమల్ హాసన్ ఔట్

by Hajipasha |
రాజ్యసభ సీటు కోసం డీల్.. ఎన్నికల బరి నుంచి కమల్ హాసన్ ఔట్
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అధికార డీఎంకే సారథ్యంలోని కూటమిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఒక సీటును కేటాయిస్తారని వెల్లడించారు. డీఎంకే అధినేత, ఎంకే సీఎం స్టాలిన్‌తో భేటీ అనంతరం ఈవివరాలను కమల్ హాసన్ మీడియాకు తెలిపారు. తమ పార్టీ కానీ, తాను కానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే కూటమికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తేల్చి చెప్పారు. డీఎంకే కూటమితో చేతులు కలిపింది పదవుల కోసం కాదని, దేశం కోసమన్నారు. ఎంఎన్ఎం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం మాట్లాడుతూ.. ఎంఎన్ఎం పార్టీ ఈఎన్నికల్లో పోటీచేయడం లేదన్నారు. ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed