- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకరు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌లో ప్రమాదం జరగగా ఓ వ్యక్తి మృతి చెందగా..మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజస్వీ యాదవ్ జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా సోమవారం అర్ధరాత్రి బిహార్‌లోని పూర్ణియాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్నియా-కతిహార్ ప్రధాన రహదారిపై తేజస్వీ ఎస్కార్ట్‌లోని వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను పూర్నియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తిని మహమ్మద్ అలీమ్‌గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో తేజస్వీ అక్కడ ఉన్నాడా లేడా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. కాగా, తేజస్వీ చేపట్టిన జన్ విశ్వాస్ యాత్ర ఫిబ్రవరి 20న ప్రారంభమైంది.