సునీతా కేజ్రీవాల్‌తో ఆప్ ఎమ్మెల్యేల భేటీ: ఢిల్లీలో కీలక పరిణామం

by samatah |
సునీతా కేజ్రీవాల్‌తో ఆప్ ఎమ్మెల్యేల భేటీ: ఢిల్లీలో కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టు కాగా ఆయనను తిహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలు మంగళశారం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అయితే జైలు నుంచి ప్రభుత్వాన్న నడపడానికి కేజ్రీవాల్‌కు మద్దతిచ్చేందుకే వీరంగా సునీతతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆప్‌పై బీజేపీ చేస్తున్న ఆరోపణల గురించి సునీతతో చర్చించినట్టు సమాచారం. 55మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేజ్రీవాల్‌ రాజీనామా చేయొద్దని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ఎమ్మెల్యేలు సునీతకు సూచించినట్టు తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య సునీతను సీఎం చేయనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు సునీతతో భేటీ కావడం చర్చనీయాశంగా మారింది. అంతకుముందు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed