- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నేతకు క్యాన్సర్.. ఎమోషనల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ శ్రేణులకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బుధవారం ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందని భావిస్తున్నా. తాను లోక్ సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేను. 'ప్రధానికి అన్ని విషయాలు వివరించాను. ఈ దేశం, బిహార్, బీజేపీ పార్టీకి ఎల్లప్పుడు రుణపడి ఉంటాను' అని ట్విట్ చేశారు.
2005 నుంచి 2020 మధ్య నితీశ్ కుమార్ సర్కార్ హయాంలో బిహార్ రాష్ట్రానికి రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పని చేసిన శుశీల్ కుమార్ మోడీ.. 2020 లో రామ్ విలాస్ పాసవాన్ మరణంతో ఖాళీ ఏర్పడిన రాజ్యసభ స్థానానికి బై పోల్ ద్వారా ఎన్నికయ్యారు. నిన్ననే ఆయన పదవీ కాలం ముంగియగా ఆ మరుసటి రోజే తనకు ఉన్న వ్యాధి విషయాన్ని బహిర్గతం చేశారు. కాగా రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సుశీల్ కుమార్ సభ్యుడిగా ఉన్నారు. అనారోగ్యం రీతా ఈ కమిటీ నుంచి తప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు సుశీల్ కుమార్ అనారోగ్యంపై పలువురు నాయకులు స్పందిస్తున్నారు.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |