ఆ రెండు రాష్ట్రాల్లో ఆప్ పార్టీకి షాక్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-08 06:17:17.0  )
ఆ రెండు రాష్ట్రాల్లో ఆప్ పార్టీకి షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఆ రెండు రాష్ట్రల ఎన్నికల పోరులో ఆప్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేక చతికిల పడింది. హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. మునుముందు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఆప్ పార్టీకి నిరాశ కరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానాలో తొలుత కాంగ్రెస్ తో పొత్తు ప్రయత్నాలు జరిగినా సీట్ల పంపకం తేడాతో కాంగ్రెస్ తో విభేధించిన ఆప్ ఆ రెండు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించి ఆశించిన ఫలితాలు సాధించలేక భంగపడింది. ఓట్ల చీలికతో పరోక్షంగా ఎన్డీఏ కూటమికే ఆప్ పోటీ మేలు చేసిందన్న విమర్శల పాలైంది.

Advertisement

Next Story

Most Viewed