- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆకాశంలో అందినంత! 100 రోజుల్లో 200 విమానాల్లో వ్యక్తి జర్నీ.. అసలు విషయం తెలిస్తే షాక్..
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వ్యక్తి వంద రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించాడు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే ఆ వ్యక్తి పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటే పొరపాటే. అతను ఓ దొంగ. దొంగతనాలు చేయడానికి ఏకంగా విమాన ప్రయాణికులనే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. ఎంతో మందికి మస్కా కొట్టిన అతను.. చివరికి మహిళ ఫిర్యాదుతో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలు పోయినట్లు తాజాగా ఫిర్యాదు చేసింది.
మరో ప్రయాణికుడు రూ. 20 లక్షలు గల వస్తువులు కనిపించడం లేదని పోలీసులకు ఆశ్రయించాడు. ఇదే తరహాలో వివిధ ఎయిర్‌పోర్టుల పరిధిలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అయితే, ఇదంతా కూడా కూడా ఒక గ్యాంగ్ పని అని మొదటగా పోలీసులు అనుమానించి.. సీసీ ఫుటేజీలను చెక్ చేశారు. ఈ క్రమంలోనే ఓ అనుమానితుణ్ని అరెస్ట్ చేసి విచారించగా దొంగ బయట పడ్డాడు. రాజేష్ కపూర్ అనే వ్యక్తి ఆ నేరాన్ని అంగీకరించాడు.
విచారణలో ఎన్నో విషయాలు వెల్లడించాడు. విమాన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకోని మాటలు కలిపి వారితో పరిచయం పెంచుకునేవాడు. ముఖ్యంగా వయసు పైబడిన వారిని ఎంచుకోని.. ఏదో ఒక సాకు చెప్పి వారి పక్క సిట్లో కూర్చోని వారికి తెలియకుండానే వారి విలువైన సామాన్లు కొట్టేసేవాడు. అయితే ఇతనికి ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో రిక్కీ డీలక్స్ పేరుతో సొంత గెస్ట్ హౌస్ ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ ఇంట్లోనే పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.