సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

by Anjali |   ( Updated:2023-10-16 07:57:26.0  )
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. లేవనెత్తిన సమస్య యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా రాజ్యాంగ ధర్మాసనానికి బిదిలీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అక్రమంగా విరాళాలు వస్తుననాయని పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. గడిచిన ఆరేళ్లలో బీజేపీ పార్టీకే అత్యధికంగా విరాళాలు అందాయని వీటిలో సగానికి పైగా విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు నిర్ణయం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed