- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మనిషి తలపై జంతువులా పెరిగిన కొమ్ము.. ఆశ్చర్యం కలిగిస్తోన్న ఈ వింత ఘటన ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో వింత ఘటనలు చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు రెండు తలలతో పాప జన్మించడం, 24 వేళ్లతో పుట్టడం, ఆవు కడుపులో మేక జన్మించడం.. ఇలా ఎన్నో వింతలు రోజుకు ఎన్నో చూస్తుండగా.. తాజాగా ఓ వ్యక్తి తలపై జంతువు కొమ్ము పెరగడం సోషల్ మీడియాలోని జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్తే.. ‘మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా రహ్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల శ్యామ్ లాల్ యాదవ్ తలకు 2004లో గాయం అయ్యింది. తర్వాత తలపై చిన్న కొమ్ములా పెరగడం ప్రారంభమైంది. అది కాస్త పెద్దగవ్వడంతో శ్యామ్ లాల్ వైద్యుడిని సంప్రదించాడు. వైద్యులు శ్యామ్ ను పరీక్షించగా.. దీన్ని ‘‘కటానియస్ హార్న్ లేదా జంతు కొమ్ము అని పిలుస్తారు. ఇది జంతువుల కొమ్ములా కనిపించే అరుదైన చర్మపు పెరుగుదల.
కొన్ని సార్లు క్యాన్సర్ కు కూడా దారితీయొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల వృద్ధుల్లో ఈ కొమ్ములు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది చర్మం నుంచి బయటకు అంటుకునే గట్టి, పసుపు-గోధుమ రంగు పదార్థం లా కనిపిస్తుంది. ఇది స్త్రీ-పురుషులిద్దరిలో సమానంగా సంభవించగా.. పురుషుల్లో పెరుగుదలకు మాత్రం క్యాన్సర్ గా మారడానికి అవకాశం ఉంటుంది’’ అని వైద్యులు వెల్లడించారు.