BRS : ఇండ్లు కూల్చింది ఒక చోట, పాదయాత్ర చేసేది మరో చోటనా ? : బీఆర్ఎస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-06 06:18:02.0  )
BRS : ఇండ్లు కూల్చింది ఒక చోట, పాదయాత్ర చేసేది మరో చోటనా ? : బీఆర్ఎస్
X

దిశ, వెబ్ డెస్క్: మూసీ(Musi) పునరుజ్జీవనం ప్రాజెక్టు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth reddy) ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్(Brs) పార్టీ ఆరోపించింది. ఇండ్లు కూల్చింది ఒక చోట, పాదయాత్ర చేసేది మరో చోటనా అని ఎక్స్ వేదికగా నిలదీసింది. తలాతోక లేని పాలన చేస్తున్న తుగ్లక్ సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించింది. మూసీ సుందరీకరణ పేరుతో పేదలను రేవంత్ సర్కార్ నిండా ముంచుతుందని మండిపడింది. సీఎం రేవంత్ రెడ్డి బాపుఘాట్ ప్రాంతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి, ముసారాంబాగ్ ప్రాంతంలో ఇండ్ల కూల్చివేతలకు పాల్పపడ్డాడని, పాదయాత్రలు మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండలంలో చేస్తున్నాడని ఇది తుగ్లక్ పాలనకు నిదర్శనమని విమర్శించింది.

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ నది పరివాహక ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. అయితే మూసీ ప్రక్షాళన పునరుజ్జీవనం ప్రాజెక్టును తొలి దఫా హైదరాబాద్ పరిధిలో చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పరివాహక జిల్లా్ల్లో పర్యటించడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది.

Advertisement

Next Story