Bunny Vasu: తండేల్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కాలర్ డైలాగ్ వాడిన నిర్మాత బన్నీ వాసు

by Prasanna |
Bunny Vasu: తండేల్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ కాలర్ డైలాగ్ వాడిన నిర్మాత బన్నీ వాసు
X

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన మూవీ 'తండేల్' (Thandel). చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా, మేకర్స్ రిలీజ్ డేటును అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 7న మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఎన్టీఆర్ కాలర్ డైలాగ్ వాడి వార్తల్లో నిలిచాడు.

బన్నీ వాసు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ " అక్కినేని అభిమానులందరికీ చెబుతున్నాను..ఫిబ్రవరి ఆరో తారీఖు సాయంత్రం షాపింగ్ మాల్ కు వెళ్లి మంచి షర్ట్ కొనుక్కొని నైట్ బాగా ఐరన్ చేయండి, కాలర్ ని బాగా ఐరన్ చేయండి, ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం మీరు మార్నింగ్ షో చూసిన తర్వాత మీరు కాలర్ ఎత్తుతారు.. ఎత్తే రోజు మాత్రం ఫిబ్రవరి 7 న కాలర్ ఎత్తుకునే సినిమాని అయితే మేము డెలివరీ చేస్తున్నాం" అని తెలిపాడు. దీనిపై రియాక్ట్ అయిన అక్కినేని ఫ్యాన్స్, నెటిజన్స్ ఎన్టీఆర్ కాలర్ డైలాగ్ వాడారుగా .. ఇక మీకు తిరుగులేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story