సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చిన బాలరాముడు.. శ్రీరామనవమి రోజున ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో

by Disha Web Desk 9 |
సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చిన బాలరాముడు.. శ్రీరామనవమి రోజున ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు (ఏప్రిల్ 17) శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ చూసిన రామనమ జపమే వినిపిస్తోంది. రామాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని కలులారా తిలకించారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకునేందుకు జనాలు భారీగా వచ్చారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఆయుష్మాన్ అనే బాలుడు బాలరాముడి దర్శనానికి వచ్చాడు. ఆ బాలుడు బాల రాముడి వేషధారణలో కనిపించి అక్కడున్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అక్కడున్న భక్తులందరి దృష్టిని ఆకర్షించాడు. బాలరాముడి వేషధారణలో ఉన్న ఆయుష్మాన్ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ బాలుడ్ని చూస్తే సాక్షాత్తు బాలరాముడే అయోధ్యకు నడిచి వచ్చినట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Next Story