- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bihar : గంగా నదిలో పడవ మునక..ఏడుగురు గల్లంతు..!
దిశ, వెబ్ డెస్క్ : బీహార్(Bihar) రాష్ట్రం కతిహార్ జిల్లా మణిహరిలోని హత్కోల్ గంగా ఘాట్(river Ganges) సమీపంలో నదిలో పడవ మునిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు(Six people) గల్లంతయ్యారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తోంది. రైతులు గంగనదికి అవతలివైపున ఉన్న డయారా ప్రాంతంలోని తమ పొలాలకు రాకపోకలు సాగించే క్రమంలో పడవల్లో ప్రయాణిస్తుంటారు. ఆదివారం 12 మంది కూలీలు పడవలో గంగానది దాటే క్రమంలో బోటు నది మధ్యలోకి రాగానే ఒకవైపు బరువు పెరిగి నదిలో మునిగిపోయింది. పడవ మునిగిపోతుండటాన్ని చూసిన ఘాట్ వద్ధ ఉన్న ప్రజలు కేకలు వేశారు.
స్థానికులు పడవలో వచ్చి నదిలో మునిగిపోతున్న వారిలో ఐదుగురిని రక్షించినప్పటికి, మరో ఏడుగురు జాడ లభించలేదు. కాగా పడవలోని ఓ యువకుడు తన ప్రాణాలను పట్టించుకోకుండా ఇద్దరు పిల్లలను మరో పడవ ఎక్కేందుకు సహాయం చేయగా, తను మాత్రం నదిలో కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాయి. గల్లంతైన వారిలో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.