వారే దర్యాప్తు సంస్థలకు భయపడతారు.. ప్రతిపక్షాల లేఖలకు బీజేపీ కౌంటర్

by Vinod kumar |
వారే దర్యాప్తు సంస్థలకు భయపడతారు.. ప్రతిపక్షాల లేఖలకు బీజేపీ కౌంటర్
X

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై బీజేపీ కౌంటర్ ఎటాక్ దిగే ఆలోచనలు చేస్తుంది. దీనిలో భాగంగా 9 రాష్ట్రాల్లో ప్రెస్ మీట్‌లు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణ, బిహార్ వంటి రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లేఖలపై సంతకాలు చేసిన వారిని విచారణకు భయపడే అవినీతి నేతలుగా చూపాలన్నది బీజేపీ వ్యూహమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీలో ఎంపీ మనోజ్ తివారీ, బెంగాల్‌లో సువేందు అధికారి, బిహార్‌లో సంజయ్ జైస్వాల్, యూపీలో బ్రిజేష్ పథాక్, తెలంగాణలో బండి సంజయ్ సమావేశాల్లో పాల్గొనున్నారు. ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను తీరును తప్పుబడుతూ ఆప్‌తో సహా పలు విపక్ష పార్టీలు ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇందులో లేకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed