Haryana: హర్యానాలో 8,821 మంది వందేళ్లు దాటిన ఓటర్లు

by S Gopi |
Haryana: హర్యానాలో 8,821 మంది వందేళ్లు దాటిన ఓటర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా రాష్ట్రంలో 8,821 మంది వందేళ్లు దాటిన వారితో సహా 2 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని ఎన్నికల ప్రధాన అధికారి పంకజ్ అగర్వాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5న జరిగే ఎన్నికల కోసం మొత్తం 20,629 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలలో మొత్తం 2,03,54,350 (2.03 కోట్లు) ఓటర్లు ఉండగా, 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 8,821 మంది ఉన్నారు. అర్హత కలిగిన ఓటర్లలో 1,07,75,957 (1.07 కోట్లు) మంది పురుషులు, 95,77,926 (95.77 లక్షలు) మహిళలు, 467 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.24 లక్షలు మంది ఓటర్లు 18-19 సంవత్సరాల వయస్సు గలవారు, 2.31 లక్షల మంది 85 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు, 1.49 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 20,629 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని అగర్వాల్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed