- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొలిదశ ఎన్నికల బరిలో 8 మంది కేంద్రమంత్రులు..!
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల తొలిదశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, తొలి దశ ఎన్నికల బరిలో ఎనిమిది మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఒక మాజీ గవర్నర్ కూడా ఉన్నారు.
కేంద్ర రోడ్డు,రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ.. 2014, 2019లో భారీ మెజార్టీతో నాగ్ పూర్ నుంచి విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా అరుణాచల్ మాజీ సీఎం నబమ్ టుకీ ఉన్నారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్.. అసోంలోని దిబ్రూగఢ్ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. మరో కేంద్రమంత్రి రామేశ్వర్ స్థానంలో సర్బానంద సోనోవాల్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ. ముజఫర్‌నగర్ స్థానానికి కేంద్రమంత్రి సంజీవ్ బలియన్ బరిలో ఉన్నారు. ఆ స్థానానికే కేంద్రమంత్రి సంజీవ్ తోపాటు సమాజ్ వాదీ పార్టీకి చెందిన హరీంద్ర మాలిక్, బీఎస్పీ అభ్యర్థి ధారాసింగ్ ప్రజాపతి మధ్య హోరాహోరీ నెలకొంది. మరో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఉధంపూర్ నుంచి బరిలో ఉన్నారు. రాజస్థాన్ లోని అల్వార్ స్థానం కోసం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ తో తలపడుతున్నారు. రాజస్థాన్ లోని భికనీర్ నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి గేవింద్ రాం మేఘ్వాల్, కేంద్రమంత్రి అర్జున్ రాంమేఘ్వాల్ పోటీ పడుతున్నారు.
తమిళనాడులోని నీలగిరి స్థానానికి డీఎంకేకు చెందిన ఎ.రాజా, కేంద్రమంత్రి ఎల్ మురుగన్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాజ్యసభ మాజీ సభ్యుడు మరుగన్ తొలిసారిగా నీలగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేశారు. చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా డీఎంకే నేత కనిమెళి బరిలో ఉన్నారు. చింద్వారాలో, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పోటీలో ఉన్నారు. వెస్ట్ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ బరిలో ఉండగా.. ఆయనపై కాంగ్రెస్ స్టేట్ చీఫ్ ఆశిష్ కుమార్ సాహా పోటీ చేస్తున్నారు. ఇక, రాజస్థాన్ లోని చురులో బీజేపీ నేత దేవేంద్ర ఝజరియా, కాంగ్రెస్ నేత రాహుల్ కస్వాన్ల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది.