బిహార్‌లో విషాదం.. కల్తీ మద్యానికి 8 మంది బలి..

by Vinod kumar |
బిహార్‌లో విషాదం.. కల్తీ మద్యానికి 8 మంది బలి..
X

పాట్నా: బిహార్‌లో కల్తీ మద్యం మరోసారి విషాదం సృష్టించింది. మోతిహరీ ప్రాంతంలోని లక్ష్మీపూర్, పహర్ పూర్, హర్సిద్ధీలో కల్తీ లిక్కర్ తాగిన ఘటనలో 8 మంది మరణించారు. మరో 25 మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలో సరన్ జిల్లాలో విషపూరిత మద్యం సేవించిన ఘటనలో 40 మంది మరణించారే జాతీయ మానవ హక్కుల నివేదికపై ప్రతిపక్ష పార్టీ బీజేపీ విమర్శలకు దిగింది. అధికారుల ఈ మరణాలకు కారణమని ఆరోపించింది.

మరోవైపు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఎన్‌హెచ్చార్సీని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేస్తుందని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ దుయ్యబట్టింది. గతంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మద్యం తాగినవారు చనిపోతారని చెప్పారు. 2016లో నితీష్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో కల్తీ మద్యం మరణాలు తరుచుగా నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed